AP Renewable Power Projects: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఆమోదం..! 16 h ago
AP: పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి తెలిపింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదించిన 5 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర క్యాబినేట్ ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాకినాడలో ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏఎం గ్రీన్ అమ్మోనియా లిమిటెడ్ సంస్థ, గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్. అలాగే, కాకినాడలో జాన్ కాకెరిల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ, రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి యూనిట్. నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో 119 మెగావాట్ల పవన, 130 మెగావాట్ల సౌర..హైబ్రీడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ కు అనుమతి ఇవ్వబడింది. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ 400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది.